onions: ఉల్లిగడ్డలు చోరీ చేసి.. కిలో రూ.10 చొప్పున విక్రయించిన దొంగలు!

  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
  • గోదాములో 12 బస్తాల ఉల్లి చోరీ 
  • పోలీసు కస్టడీలో నిందితులు 

దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు పెరిగిపోవడంతో దొంగల దృష్టి ఉల్లిపై పడింది. పలు ప్రాంతాల్లో ఉల్లిని చోరీ చేస్తోన్న దొంగలు వాటిని ఇతర ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. మధ్యప్రదేశ్‌, గ్వాలియర్‌లోని గోదాములో వున్న 12 బస్తాల (ఒక్కో బస్తా 50 కిలోలు) ఉల్లిని, రెండు బస్తాలలోని వెల్లుల్లిని దొంగలు చోరి చేశారు. చోరీ చేసిన ఉల్లి విలువ దాదాపు రూ.60 వేలు ఉంటుంది. ఆ ఉల్లిని గ్వాలియర్ లోని మరో ప్రాంతంలో కిలో రూ.10 చొప్పున విక్రయించారు.

దేశ వ్యాప్తంగా ఉల్లి కిలో రూ.100కు దాటితే ఈ దొంగలు మాత్రం రూ.10కే విక్రయిస్తుండడంతో స్థానికులు ఎగబడ్డారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More Telugu News