కేశినేని నాని హౌస్ అరెస్ట్

26-12-2019 Thu 09:57
  • విజయవాడలోని నివాసంలో గృహ నిర్బంధం
  • అమరావతి రైతుల ఆందోళనలో పాల్గొనకుండా హౌస్ అరెస్ట్
  • ఆందోళనలను తీవ్రతరం చేసిన రైతులు

టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని నివాసంలో గృహ నిర్బంధం చేశారు. అమరావతి ప్రాంత రైతులు కొనసాగిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా... ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈమేరకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. రాజధానిని ఇక్కడే ఉంచాలని... అభివృద్ధిని మాత్రమే వికేంద్రీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనకు విపక్షాలు మద్దతు పలుకుతున్నాయి.