బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించిన కారు.. పలువురికి గాయాలు

26-12-2019 Thu 08:46
  • ఈ తెల్లవారుజామున ఘటన
  • కారును ఢీకొట్టి ఫుట్‌పాత్‌పైకి
  • ప్రాణభయంతో పరుగులు తీసిన జీహెచ్ఎంసీ కార్మికులు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఈ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకురావడంతో రోడ్లను  శుభ్రం చేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కారులో ఉన్న ముగ్గురు యువకులు అత్తాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.