సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

26-12-2019 Thu 07:27
  • వెబ్ సీరీస్ కి రకుల్ కూడా ఓకే 
  • అజిత్ కి విలన్ గా కార్తికేయ 
  • 'బాహుబలి' నిర్మాతల తాజా చిత్రం

  *  పాప్యులర్ స్టార్ హీరోయిన్లంతా ఇప్పుడు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నారు. సమంత, కాజల్, తమన్నా వంటి బిజీ తారలు ఇప్పటికే వెబ్ సీరీస్ కు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు. ఈ కోవలో త్వరలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరనుంది. 'డిజిటల్ ప్రపంచం నుంచి నాకు కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయి. నాకూ ఆసక్తిగానే వుంది. కొత్త పాత్రలు వస్తే, మంచి ఆఫర్ అనిపిస్తే తప్పకుండా చేస్తాను' అని చెప్పింది.
*  తమిళ స్టార్ హీరో అజిత్ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయ ప్రధాన విలన్ పాత్రను పోషిస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కార్తికేయ బల్క్ డేట్స్ ను కేటాయించాడట. ఈ సినిమా తమిళంలో తనకు మంచి గుర్తింపును తెస్తుందని కార్తికేయ భావిస్తున్నాడు.
*  గతంలో 'బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ తన తదుపరి చిత్రాన్ని వెంకటేశ్ మహా దర్శకత్వంలో నిర్మిస్తోంది. మలయాళంలో వచ్చిన 'మహేశింతే ప్రతీకారం' చిత్రానికి రీమేక్ గా రూపొందే ఈ తెలుగు చిత్రానికి 'ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య' అనే టైటిల్ని ఖరారు చేశారు.