రహస్య వివాహంపై స్పందించిన శ్రియ.. తాను బిజీగా ఉంటే ఆయన ఆనందిస్తారన్న సినీ నటి!

26-12-2019 Thu 07:03
  • గతేడాది మార్చిలో రహస్య వివాహం
  • రష్యా టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీతో పెళ్లి
  • తన జీవితాన్ని ప్రైవేటుగా ఉంచుకోవడానికే ఇష్టపడతానన్న నటి

గతేడాది మార్చిలో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కొశీవ్‌ను సినీ నటి శ్రియ రహస్యంగా పెళ్లాడింది. రాజస్థాన్‌లో వీరి వివాహం జరగ్గా కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి విషయాన్ని  ఇప్పటి వరకు  అత్యంత రహస్యంగా ఉంచగా తాజాగా, శ్రియ స్పందించింది. పెళ్లి విషయంలో దాయడానికి ఏమీ లేదని, అయితే తన జీవితాన్ని ప్రైవేటుగా ఉంచుకోవడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. నటనను కొనసాగిస్తానని, ఈ విషయంలో తన భర్త సహకారం ఉందని పేర్కొంది. తాను బిజీగా ఉంటేనే ఆయన ఆనందిస్తుంటారని తెలిపింది. తన పెళ్లై దాదాపు రెండేళ్లు అవుతున్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని శ్రియ నవ్వుతూ చెప్పింది.