చిత్తూరు ప్లాంట్ నుంచి తొలి బైక్ విడుదల.. ‘హీరో’కు చంద్రబాబు అభినందన

26-12-2019 Thu 06:28
  • నాటి అభివృద్ధి పనుల ఫలితాలు చూస్తుంటే ఆనందంగా ఉంది
  • నవ్యాంధ్రకు తీసుకొచ్చిన మొదటి భారీ పరిశ్రమ ఇదే
  • ఎంతో పోటీని తట్టుకుని తీసుకొచ్చాం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు ప్లాంట్‌లో తయారుచేసిన తొలి బైక్‌ను ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంస్థకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తీసుకొచ్చిన మొదటి భారీ సంస్థ ‘హీరో’ అని తెలిపారు. అప్పుడు చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు ఇప్పుడు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఏపీని ఆటోమొబైల్ రంగానికి చిరునామాగా తీర్చిదిద్దాలన్న గొప్ప ప్రయత్నంలో భాగంగా ఎంతో పోటీని తట్టుకుని హీరో మోటోకార్ప్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.