NPR: ఎన్పీఆర్ విషయంలో మాకు నమ్మకం లేదు: అధీర్ రంజన్

  • 2011లో ఎన్పీఆర్ జరిపామన్న కాంగ్రెస్ నేత
  • తాజాగా బీజేపీ ఎన్పీఆర్ కార్యక్రమం చేపట్టింది
  • అప్పటి సమయం.. ఇప్పటి సమయం మధ్య తేడా ఉంది

కేంద్రం చేబడుతున్న జాతీయ జనాభా జాబితా (ఎన్‌పీఆర్)పై తమకు విశ్వాసం లేదని లోక్ సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఏఏపై భారతదేశం రగులుతున్న తరుణంలో ఎన్పీఆర్ గురించి వాళ్లెందుకు (కేంద్రం) మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మొదటిసారి చేపట్టిన సమయం, పధ్ధతి, అదే అంశంపై బీజేపీ సర్కారు చెబుతున్న ప్రస్తుత సమయానికి, మాటలకు మధ్య తేడా ఉందన్నారు.

ఎన్పీఆర్ అంశం విషయంలో కేంద్రంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు.  'మోదీ, షా చాలా చెబుతున్నారు. 2011లో ఎన్పీఆర్ జరిపాం. అయితే అప్పటి సమయానికి, ఇప్పటి సమయానికి తేడా ఉంది' అని చౌదరి అన్నారు. ఎన్ఆర్‌సీపై గత కొద్ది నెలలుగా అగ్రనేతలిద్దరూ చెబుతున్నవి అబద్ధాలన్నారు. వారు చెబుతున్నవి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలే అంటూ.. అవి అందర్నీ భయపడేలా చేశాయని పేర్కొన్నారు.

More Telugu News