Amaravathi: ఏపీ సచివాలయానికి వెళ్లే రహదారి పక్కనున్న ఇళ్లకు నోటీసులు!

  • జీఎన్ రావు కమిటీ నివేదికపై ఎల్లుండి మంత్రి వర్గ భేటీ
  • ముందస్తు చర్యలు చేపట్టిన పోలీస్ యంత్రాంగం 
  • ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు చెప్పాలన్న పోలీసులు   

ఏపీ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలు, రాజధాని గురించి జీఎన్ రావు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ నెల 27న కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజధాని ప్రాంతం మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు చెప్పాలని ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మంత్రి మండలి భేటీ జరిగే రోజున ప్రజల నుంచి ఎటువంటి నిరసనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, రాజధానిని మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై అమరావతి రైతులు మండిపడుతున్నారు. వెలగపూడిలో జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదిక ప్రతులను రైతులు తగలబెట్టారు. ఈ నివేదిక అంతా ‘బోగస్’ అని మండిపడ్డారు. ఈ కమిటీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

More Telugu News