లక్నోలో వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

25-12-2019 Wed 16:40
  • 25 అడుగుల వాజ్ పేయి విగ్రహావిష్కరణ
  • లక్నోలోని లోక్ భవన్ వద్ద విగ్రహం ఏర్పాటు
  • హాజరైన రాజ్ నాథ్, యోగి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 25 అడుగుల ఈ విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్, లక్నోలోని లోక్ భవన్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాజ్ పేయికి మోదీ ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.