Andhra Pradesh: అనపర్తి సమీపంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

  • తూ.గో జిల్లా పేరా రామచంద్రపురంలో ఘటన
  • మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
  • భారీ స్థాయిలో ఆయిల్ నిల్వలు అగ్నికి ఆహుతి

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఆయిల్ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ అంతా అగ్నికి ఆహుతైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం పేరా రామచంద్రాపురంలోని ఓ ఆయిల్ ప్యాక్టరీలో ఈ రోజు ఉదయం మంటలు చెలరేగాయి. అగ్నీ కీలలు వేగంగా ఫ్యాక్టరీ అంతా విస్తరించాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.

రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట సహా జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డాయి. ఇటీవల ఈ ఫ్యాక్టరీని ఆధునికీకరించారు. సంబంధిత పనులు పూర్తయిన తర్వాత.. నాలుగు రోజుల క్రితమే నూనె శుద్ధి పనులను తిరిగి ప్రారంభించారు. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ ను ఈ ప్యాక్టరీలో శుద్ధిచేస్తారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీలో భారీగా నూనె నిల్వలున్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

More Telugu News