గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి: సీఎం జగన్ కు గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ

25-12-2019 Wed 16:17
  • పరిపాలన వికేంద్రీకరణను మేము సమర్థిస్తున్నాం
  • ‘సీమ’కు న్యాయం జరగాలన్నది మా ఆకాంక్ష
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఆలోచన హర్షణీయం

ఏపీ సీఎం జగన్ కు గ్రేటర్ రాయలసీమ నేతలు ఓ లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని, అయితే, ‘సీమ’కు న్యాయం జరగాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన హర్షణీయమని తెలిపారు. అదే సమయంలో ఓ డిమాండ్ కూడా చేశారు. రాజధానిని గ్రేటర్ రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేఖపై మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, శైలజానాథ్, చెంగారెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి, దినేశ్ రెడ్డి తదితరులు సంతకాలు చేశారు.