Hyderabad: ట్రాన్స్ జెండర్ పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం!

  • హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘటన
  • తనపై అత్యాచారం చేయబోయాడని ట్రాన్స్ జెండర్ ఆరోపణ  
  • పోలీసులకు నిందితుడి అప్పగింత  

ఓ ఆటో డ్రైవర్ తనపై అఘాయిత్యానికి యత్నించాడని ఓ ట్రాన్స్ జెండర్ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లోని బాచుపల్లిలో తనపై ఆటోడ్రైవర్ అఘాయిత్యానికి యత్నించాడని, అతని బారి నుండి  తప్పించుకున్నానని సదరు ట్రాన్స్ జెండర్ ఆరోపించింది. తోటి ట్రాన్స్ జెండర్లతో కలిసి అతన్ని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News