బీసీలకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే: మంత్రి తలసాని

25-12-2019 Wed 15:26
  • కాంగ్రెస్ వి చిల్లర రాజకీయాలు
  • తమకు ఏ పార్టీ ప్రత్యామ్నాయం కాదు
  • ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుంది

రానున్న మునిసిపల్ ఎన్నికలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అప్పుడే ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి తలసాని యాదవ్ పేర్కొన్నారు. ఈ రోజు తలసాని మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

అసలు బీసీలకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. తొలుత మీ పార్టీలోని బీసీ నేతలకు విలువ ఇవ్వండని ఉత్తమ్ కు సూచించారు. కాంగ్రెస్ చేసేవి చిల్లర రాజకీయాలంటూ.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుందని పేర్కొన్నారు. తమకు ఏ పార్టీ ప్రత్యామ్నాయం కాదని.. మునిసిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.