గచ్చిబౌలిలో హీరో మహేశ్ బాబు ఫొటో షూట్ లో తొక్కిసలాట!

25-12-2019 Wed 14:25
  • ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన ఫొటో షూట్
  • అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు
  • బారికేడ్లు విరిగిపోవడంతో పలువురికి గాయాలు

హీరో మహేశ్ బాబుతో ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన ఫొటో షూట్ లో తొక్కిసలాట జరిగింది. హైదరాబాద్ లోని గబ్చిబౌలిలో ఈ ఫొటో షూట్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఏర్పాటు చేసింది. దీంతో, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు విరిగిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సమాచారమిచ్చింది.