Jagan: గన్నేరు పప్పు పేటీఎం బ్యాచ్ శునకావేశానికి నా సానుభూతి: లోకేశ్ తీవ్ర విమర్శలు

  • ఎన్పీఆర్ అంటే ఎన్ఆర్సీకి మొదటి అడుగు అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది
  • ఇప్పటికైనా జగన్ గారు దొంగ నాటకాలు కట్టిపెడితే మంచిది
  • వైకాపా ప్రభుత్వం ఉన్న సంక్షేమ కార్యక్రమాలను ఎత్తేస్తోంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. గన్నేరు పప్పు పేటీఎం బ్యాచ్ శునకావేశానికి నా సానుభూతి అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాజ్యసభ సాక్షిగా ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్), ఎన్ఆర్సీకి మొదటి అడుగు అని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ గారు దొంగ నాటకాలు కట్టిపెడితే మంచిదంటూ విమర్శించారు.
 
వైకాపా ప్రభుత్వం ఉన్న సంక్షేమ కార్యక్రమాలను ఎత్తేస్తోందని నారా లోకేశ్ ఆరోపించారు. ఉన్న దాంట్లోనే క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకను ఆనందంగా జరుపుకోవాలని, ఆ ప్రభువు కృప మీపై ఉండాలని కోరుకుంటున్నానంటూ పేర్కొన్నారు.
 
'ఇద్దరూ ముఖ్యమంత్రులే... తనతోపాటు పేద క్రిస్టియన్ సోదరులంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఏడాది క్రిస్మస్ కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు గారు. తాను మాత్రమే సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలి, పేద క్రిస్టియన్ సోదరులు ఏమైతే నాకేంటి అనుకొని క్రిస్మస్ కానుక ఎత్తేసిన వ్యక్తి  జగన్ గారు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

జిత్తుల మారి జగన్ గారి మాయమాటలు నమ్మడానికి ముస్లిం సోదరులు సిద్ధంగా లేరంటూ నారా లోకేశ్ విమర్శించారు. వంగి నమస్కారాలు పెట్టి, రాజ్యసభ సాక్షిగా ఎన్ఆర్సీ బిల్లుకు ఒప్పుకుని ఇప్పుడు తూచ్ మేము ఎన్ఆర్సీ అమలు చెయ్యం అని జగన్ గారు చెప్పడం ఆయన నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

More Telugu News