మోదీ మరో పథకం... రూ. 6 వేల కోట్లతో 'అటల్ భూజల్' ప్రారంభం!

25-12-2019 Wed 12:20
  • నేడు వాజ్ పేయి జయంతి 
  • కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని
  • భూగర్భ జలాల పెంపే లక్ష్యమని వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం మరో కీలక పథకాన్ని ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల సందర్భంగా 'అటల్ భూజల్ యోజన'కు ఆయన శ్రీకారం చుట్టారు. దేశంలోని భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా వాజ్ పేయి ఎంతో తపించారని, ఆయన కోరిక తన కలగా మిగిలిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన మోదీ, ఈ పథకానికి తక్షణమే రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

నీటి లభ్యత తక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాలకు పథకం మేలు కలిగిస్తుందని తెలిపారు. ఇకపై గ్రామ పంచాయితీ స్థాయిలోనే, తమతమ గ్రామాల పరిధిలో భూగర్భ జలాలను ఎలా పెంచుకోవాలన్న అంశంపై చర్చించి, నిర్ణయానికి రావచ్చని, భూగర్భ జలాలను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని మోదీ తెలిపారు.