Hyderabad: హీరా గ్రూప్ ఎండీ నౌహీరాకు రూ.5 కోట్ల పూచీకత్తుతో బెయిల్ మంజూరు

  • అక్రమాలకు పాల్పడ్డ కేసులో విచారణ
  • దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు
  • హీరా గ్రూప్ కేసులను తీవ్ర మోసాల దర్యాప్తు సంస్థకు బదిలీ

హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అధిక లాభాల ఆశచూపుతూ నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులను స్వీకరించిన కేసులో హీరా గ్రూప్‌ పై విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులోనే ఆమెకు రూ.5 కోట్ల పూచీ కత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది.

హీరా గ్రూప్ కేసులను తీవ్ర మోసాల దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని ఆదేశించింది. కాగా, ఆమెతో పాటు ఇతర డైరెక్టర్ల పేరిట ఉన్న సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే తాత్కాలికంగా జప్తు చేసింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో విలువైన భూములు, భవనాలు, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద ఈడీ అటాచ్ చేసింది.

More Telugu News