రాజధానిలోనే అన్నీ ఉండాలి... అది ఎక్కడన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

25-12-2019 Wed 11:03
  • అసెంబ్లీ, సచివాలయం, సీఎం ఒక్కచోట ఉంటేనే బాగుంటుంది
  • పాలనా సౌలభ్యానికి అది మంచిది
  • కేంద్రం అడిగితే ఇదే నా అభిప్రాయంగా చెబుతా

నిన్న అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం మంచిదే అన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు పాలనా సౌలభ్యం కోసం రాజధానిలో అన్నీ ఒకే చోట ఉండాలని సూచించారు. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయాలు ఒక్కచోట ఉంటేనే పరిపాలన సజావుగా సాగేందుకు వీలవుతుందని చెప్పారు. 

నిన్న రాజధాని రైతులు తన వద్దకు వచ్చారని, వారి గోడు విన్నాక తన మనసు చలించిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప, పాలన కేంద్రీకృతంగానే ఉండాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. ఇక రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయం కేంద్రం అడిగితే ఇదే చెబుతానని తెలిపారు.