Jharkhand: ఝార్ఖండ్ విచిత్రం... ఓట్ షేరింగ్ లో అందనంత ఎత్తున ఉన్న బీజేపీ... అయినా దక్కని అధికారం!

  • అధికారంలోకి కాంగ్రెస్ - జేఎంఎం కూటమి
  • బీజేపీకి 33.37 శాతం ఓట్లు
  • కాంగ్రెస్, జేఎంఎంలకన్నా అధికమే

ఝార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ - జేఎంఎం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయన్న విషయాన్ని జాతీయ ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్ సైట్లో వెల్లడించింది. విచిత్రంగా అత్యధిక ఓట్లను బీజేపీ రాబట్టడం గమనార్హం. కాంగ్రెస్ - జేఎంఎం కూటమి సాధించిన ఓట్ల కన్నా బీజేపీకి పడ్డ ఓట్లే అధికం. అయినప్పటికీ, ఆ పార్టీ అధికారానికి దూరమైంది.

పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాలను పరిశీలిస్తే, బీజేపీ - 33.37 శాతం, జేఎంఎం - 18.75 శాతం, కాంగ్రెస్ 13.88 శాతం, ఏజేఎస్యూపీ - 8.10 శాతం, జేవీఎం - 5.45 శాతం, ఆర్జేడీ - 2.75 శాతం, నోటాకు 1.36 శాతం ఓట్లు లభించగా, మిగతావి ఇతర పార్టీలకు పడ్డాయి. జేఎంఎం, కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లన్నీ కలిపినా కూడా బీజేపీకి వచ్చిన ఓట్లతో సమానం కాకపోవడం గమనార్హం.

More Telugu News