డిసెంబర్ 31కి... నేను రెడీ... మీరు రెడీయా?: యాంకర్ శ్రీముఖి వీడియో!

25-12-2019 Wed 08:40
  • ఈ సంవత్సరం విశాఖలో ఉంటాను
  • ఎంజీఎం గ్రౌండ్స్ లో జరిగే ఈవెంట్ కు వెళుతున్నా
  • సెలబ్రేషన్స్ కు సిద్ధం కావాలన్న శ్రీముఖి

2019కి వీడ్కోలు పలుకుతూ, 2020కి స్వాగతం పలికే వేళ, తాను విశాఖపట్నంలో ఉండబోతున్నానని ప్రముఖ యాంకర్ శ్రీముఖి వెల్లడించింది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 ఫైనలిస్టుగా నిలిచిన శ్రీముఖి, ఈ సంవత్సరం డిసెంబర్ 31న విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్స్ లో జరిగే ఓ ఈవెంట్ కు హాజరు కానున్నదట.

మాన్యం హాస్పిటాలిటీస్ నిర్వహిస్తున్న 'బిగ్ బజ్' అనే కార్యక్రమంలో పాల్గొంటున్నానని, అక్కడికి వస్తే న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెబుతూ అందరమూ కలిసి సెలబ్రేట్ చేసుకుందామని అంటూ, ఓ వీడియోను విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది. అన్నట్టు ఈ కార్యక్రమానికి వెళ్లాలంటే టికెట్ కొనుక్కోవాల్సిందే. ఆ విషయాన్ని కూడా చెబుతూ, వెంటనే టికెట్లు బుక్ చేసుకుని ఈవెంట్ కు రావాలని కోరింది శ్రీముఖి. ఆ వీడియోను మీరూ చూడండి.