Telangana: ఎన్నికల సంఘం టీఆర్ఎస్ అధీనంలో పనిచేస్తోంది: జగ్గారెడ్డి

  • షెడ్యూల్ రాకముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి ఎలా వచ్చింది?
  • ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థలే టీఆర్ఎస్‌ను కాపాడుతున్నాయి
  • పండగల సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం

తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) తీరుపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార టీఆర్ఎస్ అధీనంలో పనిచేస్తోందని ఆరోపించారు. కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల అధికారా? లేక టీఆర్ఎస్ కార్యకర్తనా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం తీరును ఆక్షేపించారు.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి అది ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థలే టీఆర్ఎస్‌ను కాపాడుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ ఇంటి దగ్గర చైర్మన్లు ఊడిగం చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. అసలు పండగల సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై సీఈసీకి ఫిర్యాదు చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కోరతానని జగ్గారెడ్డి చెప్పారు.

More Telugu News