విశాఖలోని ఓ హోటల్ లో జిల్లా టీడీపీ నేతల సమావేశం?

24-12-2019 Tue 21:17
  • కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ప్రకటనపై చర్చ
  • ఈ సమావేశానికి హాజరైన గంటా, ఎమ్మెల్యేలు
  • ఇప్పటికే విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతించిన గంటా

మూడు రాజధానుల్లో ఒకటి విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలన్న వైసీపీ ప్రభుత్వం ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై చర్చించేందుకు విశాఖకు చెందిన టీడీపీ నేతలు సమావేశమైనట్టు తెలుస్తోంది. విశాఖలోని ఓ హోటల్ లో మాజీ మంత్రి గంటా, ఎమ్మెల్యేలు, వెలగపూడి రామకృష్ణ బాబు, వాసుపల్లి గణేశ్ కుమార్, గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు హాజరైనట్టు సమాచారం. కాగా, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నానని ఇప్పటికే గంటా ప్రకటించారు. జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.