విశాఖను నాశనం చేసేందుకే ఓ పథకం ప్రకారం ఇక్కడికి వస్తున్నారు: సబ్బం హరి

24-12-2019 Tue 20:07
  • అమరావతిలో భూ కబ్జా చేయడం వైసీపీకి సాధ్యం కాదు
  • అందుకే విశాఖను ఎన్నుకున్నారు  
  • పదిహేను రోజుల తర్వాత ఆధారాలతో సహా నిరూపిస్తా

మూడు రాజధానుల్లో ఒకటి విశాఖలో ఏర్పాటు చేయాలన్న వైసీపీ ప్రభుత్వ ఆలోచనపై  ప్రముఖ రాజకీయవేత్త సబ్బం హరి నిప్పులు చెరిగారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, విశాఖను నాశనం చేసేందుకే ఓ పథకం ప్రకారం ఇక్కడికి వస్తున్నారని ఆరోపించారు. విశాఖకు పెనుముప్పు రానుందని హెచ్చరించారు.

 భీమిలి నియోజకవర్గంలో కావాల్సినన్ని భూములను దోపిడీ చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని ఇప్పటికే సృష్టించుకున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. విశాఖలో రౌడీ మూకలన్నీ దిగి కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, పదిహేను రోజుల తర్వాత ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. అమరావతిలో భూములను కబ్జా చేయడం వైసీపీ నేతలకు సాధ్యం కాదు కనుక, కొత్త ప్రాంతాన్ని ఎన్నుకున్నారన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.