రాజధానిలోనే అన్నీ ఉంటే.. మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదు!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

24-12-2019 Tue 18:34
  • నిట్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి 
  • ప్రస్తుత వివాదానికి నా వ్యాఖ్యలకు సంబంధలేదని స్పష్టీకరణ
  • రాజధానిపై వెంకయ్య పరోక్ష వ్యాఖ్యలు

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై వెల్లువెత్తుతోన్న నిరసనల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. అన్నీ ఒకేచోట పెట్టాలనడం శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలోని 'నిట్' స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. రాజధానిలోనే అన్నీ ఉంటే.. మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదన్నారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న రాజధాని వివాదానికి, తాను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని వెంకయ్య పేర్కొన్నారు.