రామ్ హీరోగా మారుతి సినిమా?

24-12-2019 Tue 17:08
  • 'ప్రతిరోజూ పండగే'తో హిట్ 
  • తదుపరి సినిమా హీరోగా రామ్
  • కథపై మారుతి కసరత్తు

మారుతి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రతిరోజూ పండగే' భారీ విజయాన్ని సాధించింది. ఎమోషన్ కి కామెడీని కలిపి నడుపుతూ ఆయన ఆవిష్కరించిన ఈ సినిమాకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దాంతో ఆయన ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, తదుపరి సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఆయన తదుపరి సినిమా రామ్ తో వుండనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మారుతి చేతిలో ముగ్గురు .. నలుగురు నిర్మాతలు వున్నారు. వాళ్లలో రామ్ తో సినిమా చేసే ఆసక్తిని ఎవరు చూపిస్తారో వాళ్లతో ఆ సినిమాను చేసే ఆలోచనలో మారుతి వున్నాడని అంటున్నారు. ఆల్రెడీ రామ్ తో మారుతి మాట్లాడటం జరిగిందనీ, త్వరలో రామ్ తో సంప్రదింపులు జరపనున్నాడని చెబుతున్నారు. రామ్ ఓకే అంటే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుందన్న మాటే.