అందుకే, జగన్ మూడు రాజధానుల డ్రామా ఆడుతున్నారు: నారా లోకేశ్ ఫైర్

24-12-2019 Tue 16:28
  • జగన్ అండ్ కో దౌర్జన్యాలు చూసి పెట్టుబడిదారులు వెనక్కి పోతున్నారు
  • జగన్ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరు
  • ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త డ్రామా

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు ఆరోపణలు, విమర్శలు చేశారు. జగన్ అండ్ కో దౌర్జన్యాలు చూసి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో రాజధానులతో అభివృద్ధి అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. తన పాలనతో ప్రజలను సంతృప్తి పరచలేని జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని, అందుకే, మూడు రాజధానులు, ముప్పై రాజధానులు అంటున్నారని, అభివృద్ధి అంటే అర్థం తెలియని వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. ఈ మేరకు లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.