Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 181 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 48 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతం వరకు నష్టపోయిన హెచ్సీఎల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. కన్జ్యూమర్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 181 పాయింట్లు నష్టపోయి 41,461కి పడిపోయింది. నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 12,214 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (0.76%), హీరో మోటోకార్ప్ (0.51%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.50%), నెస్లే ఇండియా (0.41%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.40%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.80%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.69%), ఎల్ అండ్ టీ (-1.01%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.91%), టీసీఎస్ (-0.78%).

More Telugu News