Kalyan Dev: కన్నడలోను విడుదల కానున్న కల్యాణ్ దేవ్ మూవీ

  • కల్యాణ్ దేవ్ రెండో సినిమాగా 'సూపర్ మచ్చి'
  • కథానాయికగా రచితా రామ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఆ మధ్య 'విజేత' అనే సినిమా చేశాడు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా, లుక్ పరంగా కల్యాణ్ దేవ్ కి మంచి మార్కులు పడ్డాయి. నటన పరంగా ఫరవాలేదు అనిపించుకున్నాడు. ఆ తరువాత సినిమాగా 'సూపర్ మచ్చి' రూపొందుతోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు పులివాసు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను కన్నడలో కూడా విడుదల చేయాలనే ఉద్దేశంతో, కన్నడ అమ్మాయి రచితా రామ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కన్నడలో ఈ సినిమాకి 'దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీనాక్షి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. తాజాగా ఈ టైటిల్ తో కూడిన పోస్టర్ ను కూడా వదిలారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, మరో రెండు నెలలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News