Farmers Agitation Amaravati: రాష్ట్రపతికి, ప్రధానికి అమరావతి ప్రాంత రైతుల లేఖలు

  • రాష్ట్రప్రభుత్వ నిర్ణయంపై కలుగజేసుకోవాలని వినతి
  • రాజధానిపై వైసీపీ చెప్పిన అభిప్రాయాలను లేఖలో పేర్కొన్న రైతులు
  • ఏడోరోజుకు చేరిన రైతాంగ పోరాటం

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ప్రతిపాదనపై వైసీపీ సర్కారు చేసిన ప్రకటనను నిరసిస్తూ.. అమరావతి ప్రాంత రైతాంగం ప్రారంభించిన ఆందోళన ఏడో రోజుకు చేరింది. పలు గ్రామాల్లోని రైతులు, గ్రామస్థులు, రైతు కూలీలు నిరసనల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రపతికి, ప్రధానికి రైతులు లేఖలు రాశారు.  

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రం కలుగజేసుకోవాలని తమ లేఖల్లో అభ్యర్థించారు. సీఆర్డీఏ ఆక్ట్, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను తమ లేఖల్లో ప్రస్తావించారు.  తమ మొబైల్ నంబర్ వివరాలు, అడ్రస్ ను నిరూపించే ఆధార్ కార్డు ప్రతులను లేఖలకు జతచేసి పంపారు. గతంలో అమరావతి రాజధానిపై వైసీపీ చెప్పిన అభిప్రాయాలను రైతులు తమ లేఖలో పేర్కొన్నారు. అంతేకాక, రాజధాని గ్రామాల్లో నిర్మాణాలు, పెట్టిన ఖర్చు వివరాలను కూడా లేఖల్లో ప్రస్తావించారు.

More Telugu News