వైయస్ హయాంలోనే పరిశ్రమలు, ఐటీ వచ్చాయి: బొత్స

24-12-2019 Tue 13:53
  • వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందింది
  • విశాఖను అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారు
  • మా పాలనలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది

విశాఖను తాను ఎంతో అభివృద్ధి చేశానన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖకు పరిశ్రమలు, ఐటీ వచ్చాయని ఆయన చెప్పారు. వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందిందని తెలిపారు. కన్సల్టెన్సీ కంపెనీలు ఇచ్చే నివేదికలనే చంద్రబాబు అభివృద్ధి అనుకుంటున్నారని విమర్శించారు. విశాఖను అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. తమ పాలనలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.