ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో అభిమానితో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ ఫొటో!

24-12-2019 Tue 13:45
  • శర వేగంగా షూటింగ్
  • ఓ మహిళా అభిమానితో ఫొటో
  • నిలబడి భోజనం చేసిన చెర్రీ, తారక్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోలతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రూపొందిస్తోన్న అసలు సిసలైన మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ అభిమానితో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్  ఫొటో దిగారు. మరోవైపు, ఆ ఇద్దరు హీరోలు కలిసి భోజనం చేస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
కాగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌ వేషధారణలో ఓ సీన్ లో నటిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో ఇటీవల లీక్ అయిన విషయం తెలిసిందే. గడ్డం, మీసాలు, దుస్తులు అన్నీ అందులో స్పష్టంగా కనపడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను ఇప్పటికే విడుదల చేశారు. రామ్ చరణ్ లుక్ ను రాజమౌళి ఇప్పటివరకు విడుదల చేయలేదు. భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ సినిమా 2020, జూలై 30న విడుద‌ల కానుంది.