సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసు క్రీస్తు అందించారు: పవన్

24-12-2019 Tue 13:36
  • ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారు
  • ఈ విషయం క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది 
  • క్రీస్తు వెలువరించిన బోధనలు వర్తమాన సమాజానికి మార్గ దర్శకాలు 

క్రైస్తవులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 'క్రైస్తవ సోదరులందరికీ నా తరఫున, జనసైనికుల తరఫున క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసు క్రీస్తు ప్రపంచానికి అందించారు' అని పవన్ పేర్కొన్నారు.

'ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. సత్యాన్ని మానవాళికి ప్రకటించడంలో శాంతి, సహనాలను ఎక్కడా విడిచిపెట్టలేదు, క్రీస్తు వెలువరించిన బోధనలు వర్తమాన సమాజానికి మార్గ దర్శకాలు'అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.