సత్యరాజ్ గారి స్థానంలో మా తాతయ్యను ఊహించుకుని చేశాను: సాయితేజ్

24-12-2019 Tue 12:32
  • మా తాతయ్య దగ్గర నాకు చనువు ఎక్కువ
  • నాతో ఆయన అలా అనేవారు  
  • అందుకే నా పాత్ర మరింత బాగా పండిందన్న సాయితేజ్

యువ కథానాయకుల రేసులో వెనకబడిపోకుండా సాయితేజ్ పరిగెడుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రతిరోజూ పండగే' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. 'ప్రతిరోజూ పండగే' సినిమా తాత - మనవడు మధ్య సాగే కథ. ఈ సినిమాలో తాతగా సత్యరాజ్ .. మనవడిగా నేను నటించాము.

మొదటి నుంచి కూడా మా తాతయ్య వెంకట్రావుగారితో నేను ఎంతో చనువుగా ఉండేవాడిని. 'మన ఫ్యామిలీలో అంతా సినిమాల్లో వున్నారు .. నువ్వేం చేస్తావురా' అని మా తాతయ్య అడిగితే 'ఏమో తాతయ్య ఇప్పటికైతే హ్యాపీగానే వున్నాను కదా' అనే వాడిని. ఆయన వున్నప్పుడే నేను కూడా తెరపై కనిపించి వుంటే బాగుండేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. సత్యరాజ్ గారి స్థానంలో మా తాతయ్యను ఊహించుకుంటూనే మనవడిగా నా పాత్రను చేశాను. అందుకే నా పాత్ర మరింతగా ఆడియన్స్ కి కనెక్ట్ అయిందని కూడా నేను భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.