గోపీచంద్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన దిగాంగన

24-12-2019 Tue 12:03
  • సంపత్ నంది నుంచి విభిన్న కథా చిత్రం 
  • ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్
  • ప్రధాన కథానాయికగా తమన్నా

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో 'దిగాంగన' ఒకరు. కార్తికేయ కథానాయకుడిగా చేసిన 'హిప్పీ' చిత్రం ద్వారా ఈ సుందరి పరిచయమైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ గ్లామర్ పరంగా ఈ అమ్మాయి మంచి మార్కులే తెచ్చుకుంది. అలాంటి ఈ అమ్మాయి తాజాగా గోపీచంద్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.

గోపీచంద్ హీరోగా యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ను రూపొందించడానికి దర్శకుడు సంపత్ నంది ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా తమన్నాను ఎంపిక చేసుకున్నాడు. మరో కథానాయికగా 'దిగాంగన'ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్ .. తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ గా తమన్నా కనిపించనున్నారు. దిగాంగన పాత్ర ఏమిటనేదే తెలియాల్సి వుంది.