నేను దర్శకుడిని అవుతానని కలలో కూడా అనుకోలేదు: మారుతి

24-12-2019 Tue 11:30
  • మా సొంత ఊరు బందరు 
  • అల్లు అర్జున్ తో సాన్నిహిత్యం 
  •  సినిమాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చిందన్న మారుతి

టాలీవుడ్ దర్శకులలో మారుతి స్థానం ప్రత్యేకం. తొలి రోజుల్లో యూత్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన, ఆ తరువాత యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'ప్రతిరోజూ పండగే' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, "మా సొంత ఊరు బందరు .. దర్శకుడిని కావాలనే ఉద్దేశంతో నేను చిత్రపరిశ్రమలోకి రాలేదు. నేను దర్శకుడ్ని అవుతానని కలలో కూడా అనుకోలేదు. అల్లు అరవింద్ గారి శ్రీమతి వైపు నుంచి మా కుటుంబానికి బంధుత్వం వుంది. అందువలన నేను అల్లు అర్జున్ తో సన్నిహితంగా ఉండేవాడిని. అలా చిత్రపరిశ్రమను దగ్గర నుంచి చూశాను. దాంతో సినిమాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.