Jagan: జగన్ వైఖరిలో కక్ష సాధింపు ధోరణి కనపడుతోంది: కన్నా లక్ష్మీ నారాయణ

  • ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చి మోసం చేస్తారా?
  • నియంతృత్వ ధోరణి ఎవరికైనా మంచిది కాదు
  • ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా?
  • జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా లేరు

ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చి మోసం చేస్తారా? అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నియంతృత్వ ధోరణి ఎవరికైనా మంచిది కాదని అన్నారు.

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా? అని కన్నా లక్ష్మీనారాయణ నిలదీశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు.

రాజధాని మారుతుందని చెప్పి రైతులను భయపెడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రాజధానిపై గందరగోళ ప్రకటనలు చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుస్తామనడం మంచిది కాదని అన్నారు. కక్ష సాధింపు చర్యలతో ముందుకెళ్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, జగన్ వైఖరిలో కక్ష సాధింపు ధోరణి కనపడుతోందని విమర్శించారు.

More Telugu News