తండ్రి సమాధి వద్ద జగన్ భావోద్వేగం.. వీడియో ఇదిగో!

24-12-2019 Tue 09:53
  • పార్టీ నాయకులను పలకరించిన జగన్
  • సమాధిపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులు
  • ఆపై చర్చికి వెళ్లిన వైఎస్ జగన్

నేటి ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లా, ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఉదయం 9.20 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ ఎస్టేట్స్ కు వచ్చిన జగన్, తనకు ఎదురుపడిన స్థానికులను, పార్టీ నాయకులను పలకరిస్తూ, సమాధి వద్దకు సాగారు. ఆపై తన కుడిచేతిని సమాధిపై ఉంచి తల వంచుకుని కొన్ని నిమిషాల పాటు కూర్చుండిపోయారు. ఆపై సమాధిపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు. జగన్ తో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అక్కడి కార్యక్రమం తరువాత జగన్ సమీపంలోనే ఉన్న చర్చికి బయలుదేరి వెళ్లారు.