Kurnool District: 104 ఏళ్ల వృద్ధురాలి వయసును నాలుగేళ్లుగా చూపించి.. పింఛన్ నిరాకరించిన అధికారులు!

  • పింఛన్ల రీసర్వేలో వింత
  • శతాధిక వృద్ధురాలిని పసిపాపగా చూపించి జాబితా నుంచి పేరు తొలగింపు
  • అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్న పండుముదుసలి

ఆమె వయసు 104 సంవత్సరాలు. పేరు కాచిరెడ్డి అశ్వర్థమ్మ. ఆధార్ కార్డులో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలోని జోలదరాశి గ్రామానికి చెందిన ఈ శతాధిక వృద్ధురాలు అధికారులకు మాత్రం నాలుగేళ్ల చిన్నారిలా కనిపించింది. నాలుగేళ్ల పసిపాపకు పింఛనెలా ఇస్తామంటూ అప్పటి వరకు ఉన్న పింఛనును నిలిపివేశారు. పెన్షన్‌కు ఆమె అర్హురాలు కాదంటూ లబ్ధిదారుల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు.  పింఛన్ల రీసర్వేలో చోటుచేసుకున్న వింత ఇది. తన వయసు నాలుగేళ్లుగా చూపించి పింఛను జాబితా నుంచి తన పేరును తొలగించడం అన్యాయమని ఈ శతాధిక వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

More Telugu News