Tirumala: తిరుమలలో ఎంతమాత్రమూ తగ్గని భక్తుల రద్దీ!

  • 24 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్న భక్తులు
  • సాధారణ దర్శనానికి ఒక రోజు సమయం
  • సోమవారం హుండీ ఆదాయం రూ. 2.64 కోట్లు

వారాంతం ముగిసినా తిరుమలలో శ్రీవారి రద్దీ ఎంతమాత్రమూ తగ్గలేదు. సర్వదర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్టుమెంట్లు నిండివున్నాయి. శ్రీవారి సాధారణ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కలిగివున్న భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు వెంకన్నను 78,349 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 2.64 కోట్లుగా నమోదైంది. కాగా, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News