Jharkhand: ఝార్ఖండ్ ఫలితాలపై మోదీ, అమిత్ షా స్పందన

  • జేఎంఎం కూటమికి మోదీ అభినందనలు
  • ప్రజా తీర్పును గౌరవిస్తామన్న షా
  • ఝార్ఖండ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్న హోంమంత్రి

ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు స్పందించారు. 81 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నిన్న జరుగగా, జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి స్పష్టమైన విజయం సాధించింది. మ్యాజిక్ మార్క్ అయిన 41 స్థానాలను దాటేసింది. విజయం సాధించిన హేమంత్ సోరెన్‌కు, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి మంచి సేవలు అందిస్తారని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఝార్ఖండ్ ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించేందుకు ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఝార్ఖండ్ అభివృద్ధి కోసం బీజేపీ ఎళ్లవేళలా కృషి చేస్తుందని షా పేర్కొన్నారు.

More Telugu News