jharkhand: రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్న హేమంత్ సోరెన్!

  • దుమ్కా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి
  • ఏడాదిపాటు సీఎంగా పనిచేసిన హేమంత్
  • తాజా ఎన్నికల్లో జేఎంఎం కూటమి విజయ దుందుభి

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న హేమంత్ సోరెన్ తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినా అది ఏడాదికే పరిమితమైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జేఎంఎం కూటమి స్పష్టమైన విజయం సాధించింది. బీజేపీని మట్టికరిపించిన హేమంత్ సోరెన్ ఇప్పుడు రెండోసారి ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

2005లో తొలిసారి దుమ్కా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హేమంత్ సోరెన్.. పార్టీ రెబల్ అభ్యర్థి స్టీఫెన్ మారండీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో హేమత్ తన సోదరుడు దుర్గా మృతితో పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2009 నుంచి 2010 వరకు ఏడాదిపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి అర్జున్ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత జేఎంఎం మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ, జేఎంఎం, జేడీయూ, ఏఎస్‌జేయూ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఫలితంగా రాష్ట్రపతి పాలన విధించారు.

అనంతరం, జులై 2013లో హేమంత్ సోరెన్ 38 ఏళ్ల వయసులోనే ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి డిసెంబరు 2014 వరకు కొనసాగారు. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి విజయ దుందుభి మోగించడంతో హేమంత్ సోరెన్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.

More Telugu News