మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం ఉపసంహరించుకోవాలి: క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి

23-12-2019 Mon 21:47
  • ‘ఏపీని కాపాడండి అమరావతిని రక్షించండి’
  • ఈ నినాదంతో పోరాటానికి శ్రీకారం
  • జగన్ నిర్ణయం మారకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ ఉపసంహరించుకోవాలని క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. ‘ఏపీని కాపాడండి అమరావతిని రక్షించండి’ అనే నినాదంతో పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

రేపు రాష్ట్ర్రపతిని కలిసి వినతిపత్రం అందజేస్తామని అమరావతి పరిరక్షణ సమితి పేర్కొంది. రాజధాని తరలిపోకుండా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని, రాజకీయపార్టీ నాయకులను కలిసి వారి మద్దతు కూడగడతామని చెప్పింది. రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని స్పష్టం చేసింది.


 రాజధాని ఐక్య కార్యాచరణ సమితి రేపటి కార్యాచరణ

- రేపు ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహార దీక్ష
- రేపు ఉదయం 8.30 గంటలకు వెలగపూడి, మందడంలో రైతుల ధర్నా
- రేపు ఉదయం 8.30 గంటలకు తుళ్లూరులో మహాధర్నా
- ‘చలో హైకోర్టు’ పేరుతో న్యాయవాదుల ఆందోళన
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో రాజధాని రైతుల భేటీ