Andhra Pradesh: ఎన్నార్సీ బిల్లుకు మేము వ్యతిరేకం: సీఎం జగన్

  • డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వ్యాఖ్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • మైనారిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
  • డిప్యూటీ సీఎం నాతో మాట్లాడిన తర్వాతే ఎన్నార్సీపై ప్రకటన చేశారు

కేంద్రం తీసుకురాదలిచిన జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ ప్రకటించారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చేసిన వ్యాఖ్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ముస్లింలకు తాము అండగా ఉంటామన్నారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

మైనారిటీలకు తమ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని ప్రకటించారు. ఎన్నార్సీ బిల్లుకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నానని తెలిపారు. డిప్యూటీ సీఎం తనతో మాట్లాడిన తర్వాతే ఎన్నార్సీపై ప్రకటన చేశారని వెల్లడించారు. కడప రిమ్స్ లో సుమారు రూ.350 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏడురకాల అభివృద్ధి కార్యక్రమాల పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

More Telugu News