వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉంది.. ప్రజలు హర్షించేలా లేదు: టీడీపీ నాయకురాలు రేవతి చౌదరి

23-12-2019 Mon 18:17
  • ఇలాంటి పిచ్చి పాలనతో చాలా నష్టపోయాం
  • భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉండాలి
  • ఆ బాధ్యత అందరిపైనా ఉంది

ఏపీలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు హర్షించేలా లేదని టీడీపీ అధికార ప్రతినిధి రేవతి చౌదరి విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి పిచ్చి పాలనతో చాలా నష్టపోయామని ఏపీ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని, ఆ బాధ్యత అందరిపైనా వుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైజాగ్, తిరుపతి బాగా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇప్పుడు ఎవరికేమి అన్యాయం జరిగింది? అని ప్రశ్నించారు. ప్రాంతీయవాదం తలెత్తకూడదని తాము కోరుకుంటున్నామని అన్నారు.