Sankranthi special Trains: సంక్రాంతి, క్రిస్మస్.. రద్దీని తట్టుకునేందుకు 65 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

  • క్రిస్మస్, జనవరి వస్ట్, సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకేనని ప్రకటన
  • ఇప్పటికే రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్!
  • ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక ఛార్జీలు?

తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సంరంభానికి సమయాత్తమవుతున్నాయి. ఈ పండగను సొంతూళ్లలో జరుపుకోవాలని నగరాల్లోని ప్రజలు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో పండగకి సొంతూరుకు బయలుదేరనున్న ప్రజల సౌకర్యార్థం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా  క్రిస్మస్, జనవరి ఫస్ట్, సంక్రాంతి సందర్భంగా రద్దీ పెరుగుతుందన్న నేపథ్యంలో... దక్షిణ మధ్య రైల్వే 65 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాచిగూడ - శ్రీకాకుళం, తిరుపతి, సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

కాచిగూడ - శ్రీకాకుళం (07016), శ్రీకాకుళం- తిరుపతి (07479), తిరుపతి- కాచిగూడ (07146), విజయవాడ రాయనపాడు మీదుగా శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు వెళ్తాయి. కాచిగూడ- శ్రీకాకుళం మధ్య సువిధ ప్రత్యేక రైలును నడపనున్నారు. ఇక ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు కూడా ప్రత్యేకంగానే ఉండనున్నాయి. సువిధ పేరుతో వెళ్లే ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేసే అవకాశముంది.

More Telugu News