Hero Ram: భారత సైన్యం ఉపయోగించే తుపాకులను ఎక్కుపెట్టి చూసిన హీరో రామ్

  • హైదరాబాద్ లో జెన్ టెక్నాలజీస్ ప్రదర్శన
  • ముఖ్య అతిథిగా హాజరైన రామ్
  • అత్యాధునిక ఆయుధాలను పరిశీలించిన రామ్

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఓ అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. భారత సైన్యం ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలను దగ్గర్నుంచి పరిశీలించడమే కాదు, వాటిని ఎక్కుపెట్టే చాన్స్ దక్కించుకున్నాడు. హైదరాబాద్ లో జెన్ టెక్నాలజీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రదర్శనకు రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో ప్రదర్శించిన పాయింట్ 22 రైఫిల్, మెషీన్ గన్, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్సార్, ఏకే-47 వంటి మారణాయుధాలను రామ్ ఆసక్తిగా పరిశీలించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

More Telugu News