రాజధానిని మూడు ముక్కలు చేయాలనుకోవడం కరెక్టు కాదు: కాల్వ శ్రీనివాసులు

23-12-2019 Mon 15:21
  • పాలనా రాజధాని విశాఖలో ఉండాలని ఎవరు అడిగారు?
  • విశాఖను వైసీపీ నేతలు ఏం చేస్తారో?
  • విశాఖలో హైకోర్టును, కర్నూలులో పాలనా రాజధాని ఏర్పాటు చేయాలి

జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదిక పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించారని, రాజధానిని మూడు ముక్కలు చేయాలనుకోవడం కరెక్టు కాదని టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. గతంలో విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండేందుకు అంగీకరించిన జగన్, ఇప్పుడు మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు.

అసలు, పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. రాయలసీమకు రాజధానిని దూరం చేసే దురుద్దేశం జగన్ లో కనిపిస్తోందని ఆరోపించారు. విశాఖను వైసీపీ నేతలు ఏం చేస్తారోనన్న భయం కలుగుతోందని అన్నారు. విశాఖలో హైకోర్టును, కర్నూలులో పాలనా రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.