సొంత పార్టీ నాయకత్వంపై మండిపడ్డ టీ-కాంగ్రెస్ నేత వీహెచ్

23-12-2019 Mon 14:58
  • అంబేద్కర్ విగ్రహం ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు
  • ఈ ఘటనపై మా నేతల తీరు బాధ కలిగిస్తోంది
  • ఎందుకు ఎదిరించడం లేదు?
తమ పార్టీ నాయకత్వంపై టీ-కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు నెలలుగా అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని, ఈ ఘటనపై తమ నేతలు వ్యవహరిస్తున్న తీరు తనకు బాధ కలిగిస్తోందని, దీనిని ఎదిరించాలని, విగ్రహాన్ని బయటకు తెచ్చే వరకూ పోరాడాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను సీఎం కేసీఆర్ అవమానించిన విషయాన్ని ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరచాలని సూచించారు. 125 అడుగుల అంబేద్కర్  విగ్రహాన్ని పెడతానన్న కేసీఆర్ ఆ విషయాన్నే మరిచిపోయారంటూ ధ్వజమెత్తారు.