వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేశ్

23-12-2019 Mon 14:54
  • ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
  • విజ్ఞాన్ భవన్ లో వేడుక
  • అవార్డులు బహూకరించిన ఉపరాష్ట్రపతి

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులు ప్రదానం చేశారు. మహానటి చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చిన కీర్తి సురేశ్ జాతీయ ఉత్తమనటి అవార్డును వెంకయ్య చేతులమీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నిండైన చీరకట్టులో వచ్చిన కీర్తి వేదికపై ఉన్న వెంకయ్య పాదాలకు నమస్కరించారు. కాగా, తమ బిడ్డ జాతీయ అవార్డు అందుకుంటున్న మధుర క్షణాలను గ్యాలరీలో ఉన్న కీర్తి సురేశ్ తల్లిదండ్రులు ఉద్విగ్నభరితులై వీక్షించారు. ఇక, ఉత్తమ నటులుగా విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్ (యురి-ద సర్జికల్ స్ట్రయిక్స్) కు పురస్కారం ప్రదానం చేశారు.