Andhra Pradesh: రాజధానిగా తిరుపతిని ప్రకటించండి.. కొత్త బాణీ ఎత్తుకున్న చింతా మోహన్!

  • ఏపీ రాజధానిపై గందరగోళం
  • ఇప్పటికి రాజధాని నాలుగుసార్లు మారింది  
  • 1953లోనే నిర్ణయించారంటున్న మాజీ ఎంపీ

ఏపీ రాజధాని విషయంలో మాజీ ఎంపీ చింతా మోహన్ కొత్త పల్లవి ఆలపిస్తున్నారు. తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికి నాలుగు పర్యాయాలు మారిన రాజధాని, ఐదోసారి మారడం తథ్యమని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో అమిత్ షా ఇంటి చుట్టూ తిరుగుతోందని, జగన్, చంద్రబాబు ఇద్దరూ అమిత్ షా గుప్పిట్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, తిరుపతి నగరమే ఏపీకి సరైన రాజధాని అని, 1953లోనే తిరుపతిని రాజధాని చేయాలనుకున్నారని చింతా మోహన్ వెల్లడించారు.

More Telugu News